మధ్యప్రదేశ్‌కు స్వర్ణం

– 14వ మాన్‌సూన్‌ రెగట్టా పోటీలు
హైదరాబాద్‌ : ఎడతెరపి లేని వర్షం, హుస్సేన్‌సాగర్‌లోకి నిరంతర వరద నడుమ 14వ మాన్‌సూన్‌ రెగట్టా పోటీలు మూడో రోజు సైతం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. రెగట్టా జట్టు విభాగంలో 30 రేసులు జరుగగా.. వర్షంలోనూ సెయిలర్లు రెట్టించిన ఉత్సాహంతో పోటీపడ్డారు. పసిడి పతక రేసులో ఎఎస్‌ఎస్‌ భోపాల్‌, నేవీ బారు స్పోర్ట్స్‌ కంపెనీ (ఎన్‌బిఎస్‌సీ) గోవా పోటీపడగా.. మధ్యప్రదేశ్‌ స్వర్ణం సొంతం చేసుకుంది. ఎన్‌బిఎస్‌సీ గోవా రజత పతకంతో సరిపెట్టుకుంది. ఇక కాంస్య పతకం కోసం జరిగిన రేసులో తెలంగాణ సెయిలింగ్‌ అసోసియేషన్‌ (టిఎస్‌ఏ) నిరాశపరిచింది. త్రిష సెయిలింగ్‌ క్లబ్‌ (మైసూర్‌) కాంస్య పతకం సొంతం చేసుకుంది. నాలుగేండ్ల విరామం అనంతరం సెయిలింగ్‌లో టీమ్‌ రేస్‌ నిర్వహించటం గమనార్హం. 14వ మాన్‌సూన్‌ రెగట్టా పోటీలు ఆదివారం ముగియనున్నాయి.