సెయిలర్‌ గోవర్థన్‌కు స్వర్ణం!

Gold for Sailor Govarthan!– 15వ మాన్‌సూన్‌ రెగట్టా చాంపియన్‌షిప్‌
హైదరాబాద్‌: మాన్‌సూన్‌ రెగట్టా చాంపియన్‌షిప్‌ 15వ ఎడిషన్‌లో తెలంగాణ సెయిలర్లు గోవర్దన్‌ పల్లార బంగారు పతకం ఖాయం చేసుకున్నాడు. పోటీల్లో తొలి రోజు నుంచి సత్తా చాటుతున్న గోవర్దన్‌ శుక్రవారం సైతం ముందంజలో నిలిచాడు. అండర్‌ 16 ఆప్టిమిస్ట్‌ ఫ్లీట్‌ విభాగంలో మరో రేసు మిగిలి ఉండగానే స్వర్ణం, మాన్‌సూన్‌ రెగట్టా ట్రోఫీని ఖాయం చేసుకున్నాడు. తొమ్మిది పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న గోవర్థన్‌ శనివారం జరిగే చివరి రేసులోనూ విజయం సాధిస్తే ఎస్‌హెచ్‌ బాబు స్మారక ట్రోఫీని సైతం సొంతం చేసుకుంటాడు!. దీక్షిత రెండో స్థానంతో రజతం లాంఛనం చేసుకోగా.. రిజ్వాన్‌ మహ్మద్‌ (తెలంగాణ) నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. మైసూర్‌ సెయిలర్‌ ఆకాశ్‌ తంగై మూడో స్థానంలో నిలిచాడు.