ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ బంగారు దొంగతనం

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

ఒంటరి మహిళలను, సీనియర్ సిటిజెన్లను టార్గెట్ చేస్తూ ఓ వ్యక్తి బంగారు దొంగిలిస్తూ పారిపోతున్నాడని జక్రాన్ పల్లి  పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆల్తాఫ్ హైదరాబాద్ నివాసం లావుగా ఉంటాడు, బట్టతల క్యాప్ పెట్టుకుని, కుడి కాలుతో కుంటినట్లు నడుస్తూ నల్ల పల్సర్ బండి ఉపయోగిస్తూ, ఆటెన్షన్ డైవర్స్ చేసి ఒంటరి మహిళలను సీనియర్ సిటిజనులను టార్గెట్ చేసి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించి పారిపోతున్నాడు. ఇటీవల హైదరాబాదులో దొంగతనం చేసినట్టు పక్క మండలాల్లో దొంగతనం చేసినట్టు సమాచారం రావడం జరిగింది.  కావున ఎవరికైనా ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపిస్తే 100 నెంబర్ కు కాల్ చేసి పోలీసులకు తెలుపగలరని తెలియజేశారు.