అయోధ్య రామమందిరం కోసం బంగారు పాదుకాలు

–  ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అయోధ్య రామ మందిరం కోసం తయారు చేసిన బంగారు పాదుకాలకు రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళి సై సౌందర రాజన్‌ మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలోని రామ మందిరానికి విరాళంగా ఇచ్చేందుకు చల్లా శ్రీనివాస శాస్త్రి పాదుకాలను అద్భుతంగా తయారు చేయించారని ప్రశంసించారు. అయోధ్య ఆలయ అంతర్గత గర్భగుడిలో ప్రతిష్టించబడే ఈ పాదుకాలు లెక్కలేనంత మంది భక్తుల పూజలందుకుంటాయని గవర్నర్‌ తెలిపారు. ఇలాంటి పాదుకాలను శ్రీరామునికి అంకితభావంతో చల్లా శ్రీనివాస శాస్త్రి చేసిన సేవలను ఈ సందర్భంగా తమిళి సై కొనియాడారు.