బీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ

– డీసీసీబీ చైర్మెన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-యాదగిరిగుట్టరూరల్‌
బీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ అని డీసీసీబీచైర్మెన్‌ గొంగిడి మహేందర్‌ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే గొంగిడి నిలయంలో మండలంలోని సాదివెల్లి, చిన్న కందుకూరు గ్రామాల నుండి గొంగిడి మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి చేస్తున్న అభివద్ధి కార్యక్రమాలు చూసి 350 మంది బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఆయన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పల్లపు ఐలయ్య, కొరటూరు నరసయ్య, జెట్ట సంపత్‌, దొడ్డి రాజు, దొడ్డి నరసయ్య, బీజేపీ సీనియర్‌ నాయకులు నల్ల జహంగీర్‌, వడపర్తి బాల మల్లయ్య, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు గౌడ మల్లేశం, గడ్డం మల్లేశం, ఇంజ కనకయ్య, కాంగ్రెస్‌ పార్టీ యువజన నాయకులు ఇంజ నవీన్‌, ఇంజ కుమారస్వామి, ఇంజ రవీందర్‌, ఇంజ రమేష్‌, జహంగీర్‌, కిరణ్‌, కొండ మాధవి, దొమ్మాట అన్నపూర్ణ, కటకం సత్తమ్మ ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు కర్రే వెంకటయ్య,గ్రామ శాఖ అధ్యక్షులు, సాదువెల్లి డొంకెనం లక్ష్మయ్య గౌడ్‌, గ్రామ శాఖ అధ్యక్షులు చిన్న కందుకూరు కట్టె మల్లేష్‌, ఎంపీటీసీ చిన్న కందుకూరు ఎర్ర పోచయ్య, మాజీ సర్పంచ్‌ గుజ్జుక ఎల్లుబాయి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నేతి నరసింహారెడ్డి, మండల యువజన విభాగం సెక్రటరీ జనరల్‌ భీమగాని నరసింహ, మాజీ సర్పంచ్‌ చిన్న కందుకూరు నెమలి పాండు, మాజీ గ్రామ శాఖ బిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు గవ్వల రాములు, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ వంగపల్లి దుసరి కష్ణ, భీమ గాని ముత్తయ్య, దొడ్డి శ్రీశైలం పాల్గొన్నారు.