నవతెలంగాణ-కాగజ్‌నగర్
ఈ నెల 25 నుండి 29వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని రోతక్ జిల్లాలో జరిగిన 43వ సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలలో రెబ్బెన మండలం గోలేటికి చెందిన దామెర ప్రేమ్‌దీప్ ప్రతిభ కనబర్చాడు. ఈ పోటీలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన జట్టు తృతీయ స్థానంలో నిలువగా, ఈ టీంకు కెప్టెన్‌గా ప్రేమ్‌దీప్ వ్యవహరించారు. బెస్ట్ టాప్ ఫైవ్ ప్లేయర్‌గా దామెర ప్రేమ్‌దీప్‌ను ఇండియన్ బాల్ బ్యాడ్మింటన్ అసోషియేషన్ అవార్డుతో సత్కరించింది. దీనికి ముందు ప్రేమ్‌దీప్ 2023లో కర్ణాటకలో జరిగిన సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ జాతీయ స్థాయి పోటీలలో ఆడారు. ప్రేమ్‌దీప్ రెబ్బెన మండలం గోలేటి సింగరేణి పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. బెస్ట్ ప్లేయర్ అవార్డు సాధించిన ప్రేమ్‌దీప్‌ను బాల్ బ్యాడ్మింటన్ అసోషియేషన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కల నారాయణరెడ్డి, తెలంగాణ రాష్ట్ర అసోషియేషన్ సంయుక్త కార్యదర్శి ఎస్ తిరుపతి, ఎం శ్రీనివాస్, బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్, సింగరేణి పాఠశాల కరస్పాండెంట్ రెడ్డిమల్ల తిరుపతి తదితరులు ప్రేమ్‌దీప్‌ను అభినందించారు.