నవతెలంగాణ-హైదరాబాద్: కోల్‌కత ప్రొఫెషనల్ గోల్ఫ్ ఆటగాడు శంకర్ దాస్ 2024 తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సంయుక్తంగా మూడో స్థానంతో ఆఖరు రోజు వేటకు వచ్చిన శంకర్ దాస్ కండ్లుచెదిరే ప్రదర్శన చేశాడు. కెరీర్‌తో ఎనిమిదో టైటిల్ దక్కించుకున్న శంకర్ దాస్.. ఏడెండ్ల నిరీక్షణకు తెరదించుతూ మెడల్ పోడియంపై నిలిచాడు. ఈ విజయంతో పీజీటీఐ ర్యాంకింగ్స్‌లో శంకర్ దాస్ 42వ ర్యాంక్ నుంచి 14వ స్థానానికి ఎగబాకాడు. తెలంగాణ రాష్ట్ర టూరిజం, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చాంపియన్‌కు టైటిల్, రూ.15 లక్షల చెక్‌ను అందజేశారు.