మాలలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ : గోలి సైదులు

నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గాన్ని విస్మరించటానికి నిరసనగా మాలల జేఏసీ ప్రతిపాదించిన జాతీయ మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ సభ్యులు గోలి సైదులు నల్లగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గోలి సైదులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల తరఫునుండి గత కొంతకాలం సామాజిక ఉద్యమాలు చేస్తూ నల్లగొండ నియోజక వర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అగ్రకుల ప్రాబల్యం ఎక్కువ గా ఉందని వారి చెరసాలల నుండి నల్లగొండ నియోజక వర్గం విముక్తి పొందే లా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించి అసెంబ్లీకి పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాల సంఘాలు, ఎమ్మార్పీఎస్ సంఘాల నాయకులు చింతపల్లి లింగమయ్య, తెలగమల్ల మురళి, గండమల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.