ఘనంగా గోలి సాత్విక జన్మదిన వేడుకలు

– జీఎస్‌ఆర్‌ యువసేన ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
– ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ
నవతెలంగాణ-ఆమనగల్‌
తెలంగాణ రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మెన్‌ గోలి శ్రీనివాస్‌ రెడ్డి కూతురు గోలి సాత్విక జన్మదిన వేడుకలను మంగళవారం జీఎస్‌ఆర్‌ యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫారిన్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సాత్విక ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ యువసేన సభ్యులు నియోజక వర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కల్వకుర్తి నేతృత్వంలో గోలి శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో పంజుగుల గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న 130 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి ఉపయోగపడేలా ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షులుకెె. రమేష్‌, ప్రధాన కార్యదర్శి సీ.శ్రీధర్‌, మెంబర్‌షిప్‌ కమిటీ అధ్యక్షులు కిషన్‌ కుమార్‌, సభ్యులు దారమోని గణేష్‌, ప్రధానోపాధ్యాయులు ఎల్లయ్యగౌడ్‌, ఉపాధ్యాయ బృందం ఉమాదేవి, తిరుపతమ్మ, కృష్ణయ్య, పాండయ్య, పుష్పలత, బాగ్యమ్మ, కార్యదర్శి కృష్ణ, యువ నాయకులు రాజేష్‌ పాల్గొన్నారు.