దుర్గామాత అమ్మవారికి గోలి ప్రత్యేక పూజలు

నవతెలంగాణ-ఆమనగల్

రాష్ట్ర ఫుడ్ కమీషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నియోజకవర్గంలోని పెద్దాపూర్ గ్రామంలో నెలకొల్పిన దుర్గామాత అమ్మవారికి బుధవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై హాజీపూర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బటర్ ఫ్లై ఫుడ్ రెస్టారెంట్ ను అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ శాంతి గోపాల్ నాయక్, పెద్దాపూర్ సర్పంచ్ గోరటి శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్, ఏఎంసీ డైరెక్టర్ సురమళ్ల సుభాష్, మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, రాజశేఖర్, యాదగిరి, శ్రీనివాస్, రాజు, రెస్టారెంట్ నిర్వాహకులు గణేష్, జగన్, రామచంద్రయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.