నవతెలంగాణ – వేములవాడ : పండగ వాతావరణం లో అభిమానంతో వేములవాడ నియోజకవర్గ బహుజన సమాజ్ వాజ్ పార్టీ దండు కదిలింది.. వేలాది మంది బీఎస్పీ సైనికుల రాకతో వేములవాడ పట్టణం ఆకుపచ్చ రంగును పులముకుంది. బి.ఎస్.పి పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గోలి మోహన్ డప్పు చప్పులతో తిప్పపురం బస్టాండ్ మీదుగా ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వేములవాడ పట్టణంతో పాటు వేములవాడ అర్బన్, రూరల్, కథలపూర్, మేడిపల్లి, భీమారం, రుద్రంగి, చందుర్తి నుండి వచ్చిన కార్యకర్తలతో కలిసి గురువారం నామినేషన్ వేశారు, మండలాల నుండి వేల మంది బీఎస్పీ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రధాన రహదారిలోని అంబేద్కర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు కార్యకర్తల సమక్షంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోహన్ మాట్లాడుతూ వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సైన్యాన్ని చూస్తే మాటలు రావడం లేదని, ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన అన్నదమ్ములకు, యువకులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాబోయే 20 రోజుల్లో ఏనుగు సైనికులందరూ కష్టపడి పని చేయాలని, బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయబోతున్న అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన బి.ఎస్.పి పార్టీ కుటుంబ సభ్యులను చూస్తుంటే గెలుపు పక్క అనిపిస్తుందని, సైనికులందరూ కష్టపడి, ఎవరికి బయపడకుండా, ప్రలోభాలకు లొంగకుండా, దైర్యంగా పని చేయాలని, కష్టపడి పని చేసే ప్రతి ఒక్క కార్యకర్తను కడుపులో పెట్టి చూసుకుంటానని భరోసా ఇచ్చారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను అభిమానులను చూస్తే గెలుపు పక్క అనిపిస్తుందని, ప్రతి ఒక్క నాయకుడు,కార్యకర్త ఎవరి గ్రామాల్లో వారే ఉంటూ ప్రచారం చేయాలని కోరారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ.. రాష్ట్ర జరుగుతున్న పరిణామాలను గుర్తించి బిఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని అన్నారు, ఓటును ఆయుధంగా మార్చుకొని బీఎస్పీని గెలిపిస్తే ప్రజలకు మెరుగైన సేవలను అందించి రుణం తీర్చుకుంటానని అన్నారు.కాంగ్రెస్ , బిఆర్ఎస్, బిజెపి అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బి.ఎస్.పి కార్యకర్తలు, అభిమానులు వేలాదిమంది పాల్గొన్నారు.