టికెట్ కేటాయింపులో కుర్మలకు స్థానమే లేదు?

– కుర్మ యువచైతన్య జిల్లా గౌరవాధ్యక్షుడు శ్రీనివాస్ అసహనం

– బీఎస్పీలోనే బీసీలకు సముచిత స్థానమని సూచన 
నవతెలంగాణ-బెజ్జంకి 
అధికారమే ద్యేయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాష్ట్ర అభ్యర్థుల జాబితాలో గొల్లకుర్మలకు స్థానమేలేదని కుర్మ యువచైతన్య జిల్లా గౌరవాధ్యక్షుడు పెద్దొల్ల శ్రీనివాస్ యాదవ్ గురువారం అసహనం వ్యక్తం చేశారు.బీసీ సామాజిక వర్గాలపై బీఆర్ఎస్ పార్టీ అణచివేత దోరణి అవలంభిస్తోందని.. ఇప్పటికైన గొల్లకుర్మలు గొర్ల పంపిణీ..బీసీ సహయానికి బానిసలవ్వకుండా చైతన్యవంతులై..బహుజన రాజ్యాధికారమే ద్యేయంగా పనిచేస్తున్న బీఎస్పీ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని శ్రీనివాస్ యాదవ్ కోరారు. బీఎస్పీలోనే బీసీ సామాజిక వర్గాలకు సముచిత స్థానముంటుదని ప్రతి ఒక్కరూ బీఎస్పీలో చేరాలని విజ్ఞప్తి చేశారు.