రెంజల్ లో గోమాతకు ఘనంగా అంత్యక్రియలు 

నవతెలంగాణ – రెంజల్ 
మండల కేంద్రమైన రెంజల్ గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి గారికి భూమయ్య గోమాత ఈరోజు ఉదయం 3 గంటలకు ఆకస్మికంగా మృతి చెందడంతో సాంప్రదాయబదగా దానికి అంత్యక్రియల నిర్వహించారు. భాజా భాజంత్రీల మధ్య గోమాతను ఎడ్ల బండి పై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తమ ఇంటి ముందు ఎల్లప్పుడూ సంతోషంగా కనబడే గోమాత అకస్మితంగా మృతి చెందడంతో తమ కుటుంబ సభ్యులు కంటతడి పెట్టారని ఆయన తెలిపారు.