దొరల పాలన పోయి ప్రజా పాలన వచ్చింది

– నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సపోజ్ క్రిస్టమస్ వేడుకలలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత
నవతెలంగాణ కంటేశ్వర్
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన పోయిందని ప్రజా పాలన వచ్చిందని నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సపోజ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల కోసం సంక్షేమ ఫలాలు జర్నలిస్టులకు ఎలాంటి అవసరాలు ఉన్న ఆ సమయంలో తక్షణమే చేయడం జరిగిందని ఇప్పుడు కూడా తాము చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ప్రస్తుతం జర్నలిస్టులకు ఏ అవసరమున్న తన దృష్టికి తీసుకువస్తే అధికారంలో ఉన్న తమ కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకువెళ్లి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆవరణంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులలో ఉన్నటువంటి క్రైస్తవుల కోసం సపోజ్ క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక సపోస్ క్రిస్మస్ వేడుకలే కాకుండా అనేక రకాలుగా సామాజిక కార్యక్రమాలతో పాటు ప్రతి పండగలను ప్రతి సంవత్సరము ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం గొప్ప విషయమని అందుకు ప్రెస్ క్లబ్ ఆదర్శంగా ముందుకు సాగుతుందన్నారు. అదేవిధంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు అంతడుపుల రామకృష్ణ ప్రధాన కార్యదర్శి శేఖర్ మాట్లాడుతూ.. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని పండగలను అన్ని కార్యక్రమాలను కుల మతాలకతీతంగా నిర్వహించడం జరుగుతుందని అందులో జర్నలిస్టులు కూడా పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్క జర్నలిస్టులకు పేరుపేరునా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సపోజ్ క్రిస్మస్ వేడుకలకు నిజామాబాద్ సీఎస్ఐ చర్చ్ ఫాదర్ రేవరండ్ ప్రకాష్ మాట్లాడుతూ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలను నిర్వహించడం గొప్ప విషయం అని అందుకు తాను హాజరై కార్యక్రమాన్ని విజయవంతం అయినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఇలాగే జర్నలిస్టులు ప్రతి ఒక్క కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని ప్రత్యేకంగా ప్రార్థించారు. జర్నలిస్టు ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా పనిచేస్తారు కాబట్టి వారికి ఎలాంటి సమస్యలు గానీ ఇలాంటి ఇబ్బందులు కూడా ఉండకుండా ఏసుప్రభువు ఆశీస్సులు ఉంటాయని జర్నలిస్టులకు ప్రతి ఒక్కరు పేరుపేరునా ప్రార్థించారు. అంతకుముందు సి ఎస్ ఐ చర్చ్ యూత్ మెంబర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని అలరించాయి. అదేవిధంగా ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు ఘన స్వాగతం పలుకుతూ మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితతో కలిసి దేవుని పాటలు పాడుతూ, నృత్యాలు చేసి ప్రతి ఒక్కరిని అలరిస్తూ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో చర్చి సభ్యులు క్రిస్టఫర్, సన్నీ, మైఖేల్, జయనంద్ ప్రిస్లి, తో పాటు క్రైస్తవ జర్నలిస్టులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఉర్దూ జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అనంతరం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున సంబరాలలో భాగంగా ముఖ్య అతిథులు పాస్టర్ చేతులమీదుగా కేక్ కట్ చేసి సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని ఘనవిజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.