కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలి: గోనె శ్రీనివాసరావు

నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకే ఓటువేసి బారి మెజార్టీతో గెలిపించాలని మాజీ జెడ్పిటిసి గోనె శ్రీనివాసరావు, మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు రాఘవ రెడ్డి,పిఏసిఎస్ చైర్మన్ రామారావు ఉపాధిహామీ కూలీలను అభ్యర్దించారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇంఛార్జి, పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ ఆదేశాల మేరకు  సోమవారం మండలంలోని మల్లారం గ్రామoలో ఉపాధి హామీ కూలీలతో మమేకమై ప్రజలను కారు గుర్తుకు ఓటేసి కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలు వస్తేనే కాంగ్రెసోళ్లకు పథకాలు గుర్తుకొస్తాయని, ఎన్నికల తర్వాత వాటి అమలును దాటవేస్తారని, అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఇచ్చి అరిగోస పడుతున్నామని, మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఆగమైపోతామన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్  ను ఆశీర్వదించాలని, గతంలో మంత్రిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేశారన్నారు.ఈ కార్యక్రమంలో యాదగిరి రావు,రాజు,సమ్మయ్య, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.