గొంగడి సునీతని భారీ మెజార్టీతో గెలిపించాలి..

– సర్పంచ్ నునావత్ అశోక్ నాయక్

నవతెలంగాణ _బొమ్మలరామారం: మండలం తిరుమలగిరి గ్రామంలో రాబోయే ఎన్నికలో ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నునావత అశోక్ నాయక్ మట్లాడుతూ…వచ్చే ఎన్నికలలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను,కొత్త మేనిఫెస్టోను ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ కార్యకర్తలు, నాయకులు, సైనికులగా చేరవేసి, ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టి గొంగడి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. మంత్రిగా చేసే బాధ్యత మనందరిపై ఉన్నదని, 40 రోజులు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారి యొక్క వివరాలు తీసుకొని ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పొలగోని వెంకటేష్ గౌడ్ ఎంపీపీ చిమ్ముల సుదీర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గూదె బాలనర్సింహ్మ, ఉప సర్పంచ్ శేకర్, నాయకులు కుమార్, రామకృష్ణ ఉపేందర్, రాజు యాదవ్, తదితర నాయకులు పాల్గొన్నారు.