మండలంలోని రామలింగంపల్లి గ్రామంలో చిప్పల పోచయ్య కుమారుడు చిప్పల రవి మరణించగా ఆ కుటుంబ సభ్యులను మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆదివారం పరామర్శించి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తానన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సుధా గాని హరిశంకర్ గౌడ్, ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, ఎంపిటిసి ఏర్వ హేమంత్ రెడ్డి, సోలిపేట సర్పంచ్ పూడూరి నవీన్ గౌడ్, బొమ్మలరామారం ఉప సర్పంచ్ జూపల్లి భరత్, రామలింగంపల్లి గ్రామ శాఖ సల్ల రవి, నేమురి అనిల్ గౌడ్, పాల్గొన్నారు.