దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే పునాది అని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశానని, సొసైటీలను బలోపేతం చేసి, రైతాంగానికి సేవ చేశామని డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు, వంగపల్లి గ్రామాలలో స్టోరేజ్, అగ్రి అవుట్ లేట్ భవనములను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్, డిసిసిబి డైరెక్టర్ గొంగిడి మహేందర్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజనసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గ ప్రాంతానికి ఎప్పుడు కూడా డిసిసిబి చైర్మన్ అవకాశం రాలేదు, ఎప్పుడూ కూడా కోదాడ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, హుజూర్నగర్ ప్రాంతాలవారే చైర్మన్లు అయ్యే వారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల నాకు అవకాశం వచ్చిందని అన్నారు. మన ప్రాంతంలో ఉన్న సొసైటీలన్నీ బలోపేతం చేయాలని సంకల్పంతో పని చేశానని, రైతంగానికి సేవ చేయాలని మన చైర్మన్లు ఎంత కోరితే అంత లోన్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. పార్టీలకతీతంగా అభివృద్ధి చేశామని అన్నారు. దాదాపు 60 నుంచి 70 కోట్ల రూపాయలు మన ప్రాంతం వారు ఎంత అడిగితే అంత ఇచ్చామని అన్నారు. మన ప్రాంతంలో సొసైటీలను బలోపేతం చేశామని, టర్నోవర్ పెంచామని అన్నారు. సొసైటీలు బలంగా ఉంటే రైతులు సంతోషంగా ఉంటారని, మన ప్రాంతానికి ఎక్కువ ఫండ్స్ తీసుకువచ్చి అభివృద్ధి చేశామని అన్నారు. నేను ప్రమాణం స్వీకరం చేసే నాటికి నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కోట్ల లాస్ లో ఉన్నది. ఈ నాలుగున్నర సంవత్సరాలలో 110 కోట్ల లాభంలోకి తీసుకొచ్చానని అన్నారు. నేను డిసిసిబి చైర్మన్ అయ్యే నాటికి బ్యాంకు ఎనిమిదో స్థానంలో ఉండే, దానిని లాభాల్లోకి తీసుకొచ్చి, రెండో స్థానంలోకి తీసుకువచ్చానని అన్నారు. నేను చైర్మన్ గా ఉన్నప్పుడు నియోజకవర్గంలో నాలుగు బ్రాంచ్లను ఓపెన్ చేయాలని ప్రపోజల్స్ పంపమని, రాజపేట బ్యాంకు, సాంక్షన్ అయింది ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నారు, ఆత్మకూరు బ్యాంకు సాంక్షన్ అయింది రేపు ఎల్లుండి ఇనాగరేషన్ చేసుకుంటారు, చీకటిమామిడి బ్రాంచ్ కూడా ప్రపోజల్ పంపాము అది కూడా ఇనాగరేషన్ చేసుకుంటారు, మోటకొండూరు బ్రాంచ్ కు కూడా ప్రపోజల్ పంపమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మిట్ట వెంకటయ్య, మండలాధ్యక్షులు కర్రె వెంకటయ్య, మాజీ సర్పంచ్ నమిలే రాజ్యలక్ష్మి రామచందర్, మాజీ ఉప సర్పంచ్ కల్లేపల్లి మహేందర్, పిఎసిఎస్ డైరెక్టర్ గడ్డమీద శ్రీనివాస్, బి ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు కవిడే మహేందర్, బుడిగే నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.