– మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
నవతెలంగాణ-మంచిర్యాల
పట్టణంలోని మాత శిశు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు సందర్శించి మాత శిశు కేంద్రానికి మంచిరోజులు రాబోతున్నాయని తెలిపారు. రెండు రోజుల క్రితం మాత శిశు కేద్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి గర్భిణీ స్త్రీలు ఇబ్బంది ఎదుర్కొన్నారన్న వార్త చూసి వివరాలు తెలుసుకునేందుకు వచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సాంకేతిక కారణల వల్ల విద్యుత్ సరఫరాలో సమస్య ఏర్పడిందని వెంటనే దాన్ని మరమ్మతులు చేసి తిరిగి విద్యుత్ సమస్య తలెత్తకుండ అధికారులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. చిన్న సాంకేతిక పరిణామాల దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని తిరిగి అలాంటి సందర్భాలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. హాస్పిటల్‌లో జరుగుతున్న ప్రసవాలపై గైనకాలజిస్ట్‌లతో చర్చించారు. ఆస్పత్రిలో గర్భిణీ వార్డ్, ఐసీయూ, డాక్టర్లు, ల్యాబ్ గదులను పరిశీలించారు. అవసరమైన వార్డుల్లో మరి కొన్ని ఫ్యాన్‌లు, ఏసీలు ఏర్పాటు చేయలని తెలిపారు. డెలివరీ అయి చికిత్స పొందుతున్న గర్భిణులతో మాట్లాడి వైద్య సేవలు, వారి భాగోగులు అడిగి తెలుసుకున్నారు. మాత శిశు కేంద్రానికి వచ్చే గర్భిణులు వారి వెంట వచ్చే కుటుంబ సబ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కలిపించాలని అధికారులకు ఆదేశించారు. అర్థరాత్రి వేలల్లో గర్భిణులను మాత శిశు కేంద్రానికి తీసుకోచ్చే ఆశ వర్కర్ల కోసం ప్రత్యేక మైన గదుల కేటాయించాలని, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించి వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగ కుండా చూసుకోవలన్నారు. మరి కొన్ని రోజుల్లో మాత శిశు ఆరోగ్య కేంద్రానికి మంచి రోజులు వస్తాయని , పూర్తి గ ఇక్కడి నుండి తరలించి మంచిర్యాలలో గల ఐబి చౌరస్తా లో నూతనంగా నిర్మాణం అయ్యే 650 పడకలతో కూడిన ప్రధాన ఆస్పత్రిలోకి తరలిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ సమస్య ఏర్పడినపుడు అందుబాటులో లేని విద్యుత్ ఎలక్ట్రిషన్, టెక్నిషన్‌లను మార్చి వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని అధికారులను కోరారు. పర్యవేక్షకులు భీష్మ, శ్రీమన్నారాయణ, డాక్టర్ అలివేణి, మున్సిపల్ చైర్మెన్ ఉప్పలయ్య, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ పాల్గొన్నారు.