విద్యార్థులకు మంచి విద్య, నాణ్యమైన భోజనం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం, యాదగిరిగుట్ట మండలం సైదాపురం మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పిల్లలతో కలిసి సరదాగా కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలకు మంచి విద్యను అందించి ఉన్నత స్థాయికి చేరేలా ఉపాధ్యాయులు విద్యను అందించాలన్నారు. మధ్యాహ్న భోజనం ను పరిశీలించారు. విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులను ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను అర్థమవుతుందా అని విద్యార్థి, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఈ సందర్భంగా కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.