కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్రంలో సుపరిపాలన

– పాలన సంస్కరణలతో అభివృద్ధి బాట
– తెలంగాణ కీర్తి శిఖరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం
– సమీకృత కలెక్టరేట్ లతో ఒకే కేంద్రంగా పాలన
– ప్రజలకు తప్పిన అవస్థలు
– తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత 10 జిల్లాలు -పాలన సౌలభ్యం కొరకు 23 కొత్త జిల్లాల ఏర్పాటు
– గతం లో నిజామాబాద్ పట్టణానికి, మండలానికి ఒకే తహసిల్ కార్యాలయం
– ఇప్పుడు నిజామాబాద్ ఉత్తర , దక్షిణ తహసిల్ కార్యాలయాల ఏర్పాటు
– పోలీస్ సిబ్బంది ఒత్తిడి తగ్గించేందుకు మరియు ప్రజలకు రక్షణ కల్పించాలని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు
– సుపరిపాలన దినోత్సవం లో ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం లో సుపరిపాలన దినోత్సవం లో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..అధికారులకు,నాయకులకు,ప్రజలకు సుపరిపాలన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పాలన సౌలభ్యం కొరకు ప్రజలకు మంచి సేవలు అందించడానికి అనేక రకాల పాలన సంస్కరణలు తీసుకవచ్చారు.10 జిల్లాలతో ఏర్పడ్డ స్వరాష్ట్రాన్ని 33 జిల్లాలుగా విభజించి అధికారులకు పని భారం తగ్గించడమే కాకుండా ప్రజలకు జిల్లా కేంద్రాలకు సులభంగా చేరుకునేలా చేశారు.జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టర్ కార్యాలయలు నిర్మించి అన్ని శాఖల అధికారులు ఒకే దగ్గర నుండి పనిచేసేలా చేశారు.తద్వారా అభివృద్ధి-సంక్షేమ పథకాల అమలు తీరు పర్యవేక్షణ సులభతరమైంది.నూతన జిల్లాలు జోన్ల ఏర్పాటుతో 95 శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కుతున్నాయి.నూతన పోలీస్ కమిషనరేట్ ల ఏర్పాటు వల్ల నేరాలు నియంత్రణ మరియు నేర పరిశోధన సులువయింది.గ్రామ పంచాయితీ ల పరిపాలన పట్టణాల పరిపాలన తీరును పర్యవేక్షణ కొరకు జిల్లాకు ఒక అదనపు కలెక్టర్ ని నీయమించింది ప్రభుత్వం.ప్రజల సంక్షేమం కోసం,స్వరాష్ట్రం అభివృద్ధి కోసం సంస్కరణలు చేసి పేదరికాన్ని నిర్ములించుట కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సంస్కరణలు చేశారు.60 ఏండ్లు వెనుకబాటు తనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకవచ్చిన పాలన సంస్కరణల వల్ల తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్లతో ప్రగతి సాధించి దేశం లో మొదటి స్థానంలో నిలిచింది. దీంట్లో భగస్వాములైన అధికారులకు,ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియాచేస్తున్నాను.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు,నగర మేయర్ దండు నీతూ కిరణ్, నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.