గుడ్‌ జోక్‌

చీమల బారులా ఒక వరుస క్రమంలో
వాళ్ళ మీద దాడులు జరుగుతాయి
మాన ప్రాణాలు బూడిద అవుతాయి
అధికార దాహ అతివాద నాయకులు
చూసీచూడనట్టు కళ్ళకు గంతలు కట్టుకొని
తెలిసీ తెలియనట్టు మౌనంగా
ప్రపంచయాత్రకు బయలుదేరుతారు

దేశంలో….
మంటల్లో కాలుతున్న బాధితులు గళమెత్తి
తమ జీవించే హక్కు కోసం వీధుల్లో నినదిస్తే
నిరంకుశ రాజదండం రాజద్రోహ చట్టాల వలను
వేసి బంధించి జైలులో వేసి హింసిస్తుంది.

ఈ దశాబ్దంలో అబద్ధం నిజం అయింది
నిజం అబద్ధమై నాలుగు గోడల మధ్య ఉండిపోయింది
దోషులు బాధితులవుతున్నారు
బాధితులు దోషులై
మానసికంగా శారీరకంగా హింసించబడుతున్నారు.

నిద్రాణమై ఉన్న ప్రాచీన కాలం నాటి ఉగ్రవాదం
వికత రూపం ధరించి దేశాన్ని అతలాకుతలం
చేసి ప్రపంచ వ్యాప్తంగా పరువు తీస్తుంది
దేశభక్తి చాటున దేశద్రోహులు మహిళలను
రోబోట్స్లా మార్చి నడి వీధులలో నడిపిస్తున్నారు
ఇదేంటని అడిగితే
అతివాదులకు ఇదో గుడ్‌ జోక్‌ అవుతుంది
మానవత్వం లేని మనిషులకు ఇదే దేశభక్తి అవుతుంది
– సయ్యద్‌ ముజాహిద్‌ అలీ
7729929807