నిరుద్యోగులకు శుభవార్త.. 29న ఇంటర్వూలు

Good news for unemployed.. Interviews on 29th– జిల్లా ఉపాధి కల్పనాధికారి సాహితీ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగంలో  ఈనెల 29వ తేదీన ఉద్యోగాలను  గురువారం  ఉదయం 11:00 గంటలకు జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి పి సాహితి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఇంటర్వ్యూలలో ముత్థూట్ మైక్రోఫిన్ కంపెనీ వారు పాల్గొనగా 35 పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రిలేషన్ ఆఫీసర్ ఉద్యోగానికి గాను 30 ఖాళీలు ఉండగా ఇంటర్/డిగ్రీ అర్హతతో రూ.16,000/- నుంచి 22,000/- వేతనం ఉంటుందన్నారు. బ్రాంచ్ రిలేషన్ మేనేజర్ ఖాళీలు రెండు ఉండగా డిగ్రీ ఉత్తీర్ణతతో, సంబంధిత అనుభవం కలిగి ఉండాలని వేతనం రూ.22,000/- to 30,000/- ఉంటుందని తెలిపారు. స్త్రీ & పురుషులు ఎవరైనా అర్హులని తెలిపారు. భువనగిరి, జనగామా, గజ్వేల్, సిద్ధిపేట్, రామాయంపేట, హుజూరాబాద్, భూపాల్ పల్లి, పరకాల్ బ్రాంచీలలో ఖాళీలు ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి గల యాదాద్రి-భువనగిరి జిల్లా నిరుద్యోగ యువతీ  యువకులు తమ బయోడేటా లేదా రెస్యూమ్ తో పాటు, విద్యార్హతల సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఈనెల 29 న  ఉదయం 11:00 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని  కోరారు.