భక్తి శ్రద్ధలతో గుడ్ ప్రై డే వేడుకలు..

– ప్రత్యేక ప్రార్థనలతో మారుమ్రోగిన చర్చీలు 

నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని అయా గ్రామాల్లోని చర్చీల్లో క్రైస్తవులు శుక్రవారం గుడ్ ప్రై డే వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు.మండల కేంద్రంలోని సీయోను ఏవాంజీకల్ చర్చీ యందు పాస్టర్ ఓరుగంటి విక్కి సహోదరి మిరియం అధ్వర్యంలో ఏర్పాటుచేసిన గుడ్ ప్రై డే వేడుకలకు రాష్ట్ర ఆహార భద్రత మండలి సభ్యుడు ఓరుగంటి ఆనంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.యేసు క్రీస్తు జననమే గొప్ప చరిత్రను అవిష్కరించిందన్నారు.తన కోసం కాకుండ ప్రపంచ శాంతి,సత్ప్రవర్తనమైన మానవాళి జీవనం కోసం యేసు క్రీస్తు బోధనలు చేశారన్నారు. ప్రజలు చేసిన పాపాల కోసం ఎన్నో శ్రమలు అనుభవించారని..చివరకు ప్రజల కోరకు ముళ్ల కిరీటం దరించి,శిలవను మోసి మరణించి మూడవ రోజున సజీవుడై తిరిగి లేచిన మహానీయుడు యేసు క్రీస్తుయేనన్నారు.ప్రజలు యేసుక్రీస్తు జీవనాన్ని స్ఫూర్తిగా తీసుకుని మంచి మార్గంలో నడుచుకోవాలని సూచించారు. మండలంలోని అయా గ్రామాల్లోని చర్చీలు క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలతో మారుమ్రోగాయి.