ప్రజాపాలన సభలకు ప్రజల నుండి మంచి స్పందన

– మండల తాసిల్దార్ ఎండి ముజీబ్

నవతెలంగాణ- మద్నూర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని గ్రామసభల్లో పాల్గొని పెద్ద ఎత్తున దరఖాస్తులు అందజేస్తున్నారని మద్నూర్ మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ తెలిపారు. మంగళవారం నాడు మండల తహసిల్దార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోడిచర గ్రామంలో 628 దరఖాస్తులు వచ్చినట్లు అదేవిధంగా మేనూరు గ్రామసభలో 519 దరఖాస్తులు అందినట్లు తెలిపారు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు దరఖాస్తులు ఎలాంటి తప్పులు దొరలకుండా గ్రామ కార్యదర్శులు నియమించి దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం పకడ్బందీగా జరిపిస్తున్నట్లు తెలిపారు.