– పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణేష్ రావు
నవతెలంగాణ – రెంజల్
ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు పేర్కొన్నారు. సోమవారం రెంజల్ మండలం దూపల్లి జిల్లా పరిషత్ పాఠశాల లో ఆత్మీయ వీడ్కోలు మహాసభలో ఆయన పాల్గొన్నారు. తొమ్మిదవ తరగతి విద్యార్థి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు మాసం ఏర్పాటు చేశారని, పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లయితే వారికి మార్గదర్శకంగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థుల్లో నిత్య పోటీలు ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం గౌడ్, సాయి రెడ్డి, ఉపాధ్యాయులు ఈ వెంకటలక్ష్మి, పరమేశ్వర్ రాధా, రాజేశ్వర్, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ బాబన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.