– రెండో రౌండ్లో ట్రెసా, గాయత్రి
– థారులాండ్ మాస్టర్స్
బ్యాంకాక్ : థారులాండ్ మాస్టర్స్ టోర్నీలో భారత మహిళల డబుల్స్ జోడిలు శుభారంభం చేశాయి. ఆరో సీడ్ ట్రెసా జాలి, పుల్లెల గాయత్రి జంట 16-21, 21-10, 21-18తో 74 నిమిషాల్లోనే హాంగ్‌కాంగ్ జోడిపై విజయం సాధించింది. సీనియర్ షట్లర్ అశ్విని పొన్నప్పతో కలిసి తనీశ క్రాస్టో సైతం మెరిసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో 21-13, 21-17తో వరుస గేముల్లో చైనీస్ తైపీ జంటను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్లు సమీర్ వర్మ, శంకర్ ముతుస్వామి ప్రధాన టోర్నీకి అర్హత సాధించారు. మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్, మిథున్ మంజునాథ్, కిరణ్ జార్జ్ సహా మాళవిక బాన్సోద్, ఇమద్ ఫరూకీ, అష్మిత థారులాండ్ మాస్టర్స్ బరిలో నిలిచారు. పురుషుల డబుల్స్‌లో వరల్డ్ నం.1 సాత్విక్, చిరాగ్ జోడి ఆడటం లేదు. వరుస టోర్నీల అనంతరం అగ్ర షట్లర్లు విశ్రాంతి తీసుకున్నారు.