మంచి నీటిని ప్రతి గృహానికి అందించాలి..

Good water should be provided to every house.– మిషన్ భగీరథ సిఈ రాంచందర్,ఎస్ ఈ రాజేందర్ కుమార్..

నవతెలంగాణ – డిచ్ పల్లి
అనునిత్యం గ్రామీణ ప్రాంతా ప్రజలకు శుద్ధమైన త్రాగు నీటి ని అందజేసే విధంగా చూడాలని, నీటి సరఫరా లో ఏలాంటి నిర్లక్ష్యం వహించకుండ, ఎక్కడ లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని మిషన్ భగీరథ సిఈ రాంచందర్,ఎస్ ఈ రాజేందర్ కుమార్ అన్నారు. గురువారం ఇందల్ వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామం లోని రైతు వేదికలో గ్రామీణ మంచి నీటి సహాయకులకు 4రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మూడవరోజు వారు పాల్గొని మాట్లాడుతూ.. మండలంలోని ఆయా గ్రామాల్లోని గ్రామ పంచాయతీ ల్లో ఉన్న గ్రామీణ మంచి నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు సమయానుసారు క్లోరినేషన్ చేస్తూ ఉండాలని, ఎక్కడ లీకేజీలు ఉన్నా వెంటనే మరమ్మతులు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరా లో కలుషిత నీరు చేరి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయని అలాంటివి జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టే విధంగా చూడాలన్నారు.గ్రామాల్లో ఉన్న నీటి ట్యాంకుల్లో క్రమం తప్పకుండా క్లోరినేషన్ ఏ మోతాదులో వేయాలో తెలుసుకుని అదే విదంగా చేయాలని సూచించారు. పైప్లైన్ , గేట్ వాళ్ళ మరమ్మత్తుల విషయంలో క్వాలిటీకి సంబంధించిన వాటిని బిగించి లీకేజీలు లేకుండా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. నల్గు రోజుల్లో రోజుకు ఒక అంశంపై శిక్షణ అందజేస్తున్నమని ఈ శిక్షణ ను సద్వినియోగం చేసుకోని తమ తమ గ్రామాల్లో శిక్షణలో తీసుకున్న విధంగానే వ్యవహరించాలని సూచించారు. అనంతరం గ్రామీణ మంచినీటి సహాయకులకు పలు సూచనలు సలహాలను అందజేశారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఇఇ నరేష్, డీఈఈ ధర్మేందర్, డిఈఈ అరుణ్, మిషన్ భగీరథ ఏఈఈ దీప్‌చంద్, ఏఈఈ శివ తోపాటు సహాయకులు, టైనర్ తదితరులు పాల్గొన్నారు.