– రిటైర్మెంట్ ప్రకటించిన నాదల్
న్యూఢిల్లీ: ప్రపంచ టెన్నిస్ దిగ్గజం, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలుకనున్నాడు. నవంబర్‌లో జరిగే డెవిస్ కప్ ఫైనల్స్ తన కెరీర్‌కు ఆఖరు అని నాదల్ ఓ వీడియో సందేశంలో వెల్లడించాడు. ‘ ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని మీకు చెప్పేందుకు మీ మందుకొచ్చాను. గత కొన్నండ్లు కఠనంగా సాగాయి. ముఖ్యంగా గత రెండేండ్లుగా ఇబ్బంది పడ్డాను. గతంలో అవధుల్లేని ఆట ఆడలేనని అర్థం చేసుకున్నాను. డెవిస్ కప్ ఫైనల్స్ నా కెరీర్‌లో ఆఖరు పోరు కానుంది’ అని నాదల్ తెలిపాడు. టెన్నిస్ ఓపెన్ శకంలో అత్యధికంగా 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ సాధించిన రఫెల్ నాదల్.. ఓవరాల్‌గా 22 గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించాడు. రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్‌లతో సుదర్ఘ కాలం పోటీపడిన రఫెల్ నాదల్ 92 ఏటీపీ టైటిల్స్ సైతం సాధించాడు.