భిన్న ప్రేమకథతో గౌడ్‌ సాబ్‌

భిన్న ప్రేమకథతో గౌడ్‌ సాబ్‌కష్ణంరాజు బంధువు విరాట్‌ రాజ్‌ హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ గణేష్‌ మాస్టర్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మల్లీశ్వరి సమర్పణలో శ్రీపాద ఫిలింస్‌ బ్యానర్‌పై ఎస్‌ఆర్‌ కళ్యాణమండపం రాజు, కల్వకోట వెంకట రమణ, కాటారి సాయికష్ణ కార్తీక్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బుధవారం పూజా ముహూర్తంతో ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్‌ అయింది. డైరెక్టర్‌ సుకుమార్‌ టైటిల్‌ను లాంచ్‌ చేశారు. ఈ చిత్రానికి ‘గౌడ్‌ సాబ్‌’ అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌ పెట్టారు. డైరెక్టర్‌ సుకుమార్‌ మేకర్స్‌కు స్క్రిప్ట్‌ అందించగా, రాహుల్‌ సిప్లిగంజ్‌ క్లాప్‌ కొట్టారు. జానీ మాస్టర్‌, భాను మాస్టర్‌, అన్నీ మాస్టర్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, గణేష్‌ మాస్టర్‌ ముహూర్తం సన్నివేశానికి దర్శకత్వం వహించారు. డైరెక్టర్‌ సుకుమార్‌ మాట్లాడుతూ,’గణేష్‌కి పాట ద్వారా కథ చెప్పే నేర్పు ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. తను ఈ కథ చెప్పినప్పుడు షాక్‌ అయ్యాను. కథ చాలా చాలా బావుంది. టైటిల్‌లో కూడా ట్విస్ట్‌ ఉంది’ అని అన్నారు. హీరో విరాట్‌ రాజ్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా మా కెరీర్‌లో ఒక ఉత్తమ సినిమాగా నిలిచిపోతుంది. కథ, కథనం అద్భుతంగా కుదిరాయి’ అని తెలిపారు. ‘గౌడ్‌ సాబ్‌.. ట్రూ లవ్‌ స్టొరీ. తప్పకుండా ఆడియన్స్‌ ఎంజారు చేస్తారు’ అని డైరెక్టర్‌ గణేష్‌ మాస్టర్‌ చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ,’ఎస్‌ఆర్‌ కళ్యాణ్‌ మండపం ఎంతలా అలరించిందో ఈ సినిమా కూడా అదే విధంగా అలరిస్తుంది’ అని అన్నారు.