
మండల పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ శ్రేణులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ తెలిపారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంకాల బాబు, నర్సయ్య, ముత్తయ్య, చంద్రయ్య, కనుకయ్య, అని ల్, సతీశ్, ప్రవీన్, సంపత్, లక్ష్ మన్, వెంకటేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరగా మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ అయన కార్యలయంలో పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. నాయకులు ముక్కీస రత్నాకర్ రెడ్డి, గూడెల్లి శ్రీకాంత్, గూడెల్లి ఐలయ్య, బోనాల ఐలయ్య పాల్గొన్నారు.