హైదరాబాద్ : ఆండ్రాయిడ్ ఎంటర్‌ప్రైజెస్ సొల్యూషన్‌ల విస్తరణ, ఇంటిగ్రేటెడ్‌లో సహకారం అందించినందుకు గూగుల్ నుండి టెక్టోరో కన్సల్టింగ్‌కు ప్రతిష్టాత్మక గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డును పొందింది. లండన్‌లో జరిగిన ఆండ్రాయిడ్ ఎంటర్‌ప్రైజ్ గ్లోబల్ పార్టనర్ సమ్మిట్ 2024లో ఈ అవార్డును టెక్టోరో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ దన్నపనేని అందుకున్నారు. ఈ అవార్డును అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని శ్రీధర్ తెలిపారు. ఇది మా అంకితభావంతో కూడిన బృందం యొక్క కృషి, పట్టుదల, ఆండ్రాయిడ్ అడాప్షన్‌ను డ్రైవింగ్ చేయడంలో ఎడతెగని తమ శ్రమకు, సాధనకు నిదర్శనమన్నారు.