హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేసిన ఆకతాయిలు..

The hooligans attacked the head constable.నవతెలంగాణ – గీసుగొండ
ఆకతాయిలు ఓ హెడ్ కానిస్టేబుల్ ను కొట్టిన సంఘటన వరంగల్ మహానగర పరిధిలోని 16 డివిజన్ ధర్మారంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. భిక్షపతి హెడ్ కానిస్టేబుల్ గా మమునూర్ పోలిస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా భిక్షపతి బందోబస్తు డ్యూటీ పడటంతో  విధులు నిర్వహిస్తుండగా.. నలుగురు ఆకతాయిలు హెడ్ కానిస్టేబుల్ ను దూషిస్తూ, మొబైల్ లాక్కొని, కొట్టారు. ఈ విషయమై బి.భిక్షపతి పిటిషన్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నామని, దాడికి పాల్పడ ఆ నలుగురు కుర్రాళ్లు పరారీలో వున్నారు అని పోలీసులు తెలిపారు.