నవతెలంగాణ – ఆర్మూర్
క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు గోపి కృష్ణ పట్వారి అన్నారు. పట్టణంలోని రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో విద్యా వెలుగు అనే కార్యక్రమాన్ని స్థానిక విద్య హైస్కూల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ.. ప్రస్తుతం జరిగే పోటీ పరీక్షలు కోసం చదువుతున్న అభ్యర్థుల కోసం ఈ విద్యా హైస్కూల్లో చదువుకోవడానికి అవకాశం ఏప్రిల్ 28 నుండి మే 30 వరకు గల అవకాశాన్ని అభ్యర్థులు వినియోగించుకోవాలని, చక్కగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు. గౌరవ అతిథి పి.డి.జి హనుమంత రెడ్డి విద్యార్థులకులకు ఐడీ కార్డుని అందజేశారు ఈ అవకాశాన్ని ఆర్మూర్, చుట్టుపక్క ఉన్న గ్రామాల్లోని అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, ప్రాజెక్టు ఛైర్మన్ ప్రవీణ్ పవార్ , పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ పద్మ మురళి మరియు మాజీ అధ్యక్షులు పుష్పకర్ రావు , కాంతి గంగారెడ్డి, సురేష్, సభ్యులు గోనే దామోదర్ ,ఆనంద్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.