నవతెలంగాణ-భిక్కనూర్
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన గో రక్షా మహా పాదయాత్ర సోమవారం భిక్కనూరు పట్టణానికి చేరుకుంది. పట్టణంలోని రామదండు సభ్యులు, అయ్యప్ప స్వాములు ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ రామదండు సభ్యులు లక్ష్మణ్, రమేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గోమాతను గౌరవించాలని, గోవులను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్క హిందూ పై ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.