నవతెలంగాణ – జక్రాన్ పల్లి
ప్రస్తుత ఐటి శాఖ మంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ ను సన్మానించినట్టు జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు గోర్త రాజేందర్ తెలిపారు. ఇటీవల తిరుపతికి వెళ్లిన జిల్లా మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజేందర్ గురువారం తిరుపతి దర్శనానికి వచ్చిన ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ కు తిరుపతి ప్రసాదం అందజేస్తూ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన వెంట మాజీ ప్రభుత్వ విప్ అనిల్ తదితరులు ఉన్నారు.