
ముత్తారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో గురువారం నూతన చైర్మన్ అల్లాడి యాదగిరిరావు అధ్యక్షతన పాలకవర్గ సమావేశం జరిగింది. ముత్తారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ చైర్మన్ హయంలో వెచ్చించిన నిధులు, ఖర్చుల వివరాలపై ఆ సంఘం డైరెక్టర్లు నిలదీశారు. గతంలో రూ.43 కోట్లకు పైగా మంజూరైన నిధులకు ఖర్చులు అదేస్థాయిలో చూపడంతో అసలు ఏం జరిగిందని అడైరెక్టర్లు ఈ తీర్మానానికి నిరాకరించారు. ఈ విషయాని మొదట మాజీ వైస్ చైర్మన్ పోతిపెద్ది రమణారెడ్డి ప్రశ్నించడంతో మిగతా డైరెక్టర్లు సైతం జనరల్ బాడీ మీటింగ్‌లో వాటి లెక్కలు వివరాలు తేల్చిన తర్వాతనే వాటిపై సంతకాలు చేస్తామని తేల్చి చెప్పారు.సంఘం చైర్మన్ యాదగిరిరావు జోక్యం చేసుకొని, రూ.43 కోట్ల వ్యవహారం జనరల్ బాడీ మీటింగ్ లో చర్చిస్తామని తీర్మానించడంతో డైరెక్టర్లు సమావేశానికి ఒప్పుకున్నారు. సమావేశం జరుగుతుండగా డైరెక్టర్లు రమణారెడ్డి, గిరి వీరేందర్ సమావేశం మధ్య నుంచే బయటకు వెళ్లిపోయారు. సమావేశంలో సంఘం సీఈవో దాసరి ప్రసాద్, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎలుక కొమరయ్య, డైరెక్టర్లు కొంకటి మల్లన్న, గుజ్జ గోపాలరావు, మద్దెల వెంకటలక్ష్మి, మూడుసు ఓదెలు, అలగం నిర్మల, నాయిని పార్వతమ్మ పాల్గన్నారు.