ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను శనివారం ప్రభుత్వా సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు దర్శించుకున్నారు, మొదటిసారిగా మేడారం వచ్చిన ఆయనకు ఎండోమెంట్ అధికారులు పూజారులు ఘన స్వాగతం పలికి, ఆలయ సంప్రదాయం ప్రకారం ఎండోమెంట్ అధికారులు పూజారులు ఆయనకు పట్టు వస్త్రాలు సమర్పించారు,డోలు వాయిద్యాల నడుమ దేవతల గద్దెల వద్దకు తీసుకువెళ్లారు, ఆయన దేవతలకు పసుపు కుంకుమ బెల్లం పూలు సీర సారే పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సలహాదారుగా అవకాశం వచ్చేత మొదటిసారిగా మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్నాను అన్నారు, వనదేవతల దీవెనలు ప్రభుత్వానికి ఉండాలని కోరారు, ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలకే మహా జాతర రావడంతో ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు ప్రభుత్వం ఏర్పడి 70 రోజులలో అద్భుతమైన పాలిన అందిస్తుందని అన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దళిత గిరిజన బహుజన ప్రజలు అంటే ఎంతో ప్రేమ అని అందుకే ఆయన మొదటి పార్టీ కార్యక్రమాన్ని ఇంద్రవెల్లిలో మొదలు పెట్టారని అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేలా రూపకల్పన చేస్తుందని తెలిపారు, ఇప్పటికే 25 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు, కచ్చితంగా 6గ్యారంటీలు ప్రభుత్వం అమలు చేస్తుందని హామీ ఇచ్చారు, ఇప్పటికే రెండు హామీలు అమలు అయ్యాయని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు, ఆరోగ్యశ్రీ పథకం విస్తృతంగా అమలు చేస్తూ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచిందని తెలిపారు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్స్ 200యూనిట్లకు ఉచిత విద్యుత్ అమలుకు కార్యక్రమాలు సిద్ధం అయ్యాయని అన్నారు, 100 రోజుల్లో అన్ని పథకాలు అమలు చేస్తామని, ప్రజలకు మరింత సేరువగా మరింత సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.