నిజామాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సేషన్స్ కోర్టు తాత్కాలిక గవర్నమెంట్ ఫీడర్ గా నియమితులైన న్యాయవాది వెంకటరమణ గౌడ్ నిజామాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ తాత్కాలిక అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా నియమితులైన పి రాజు లు సోమవారం జిల్లా కోర్టు తమ కార్యలంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ పుష్పగుచ్చ అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ బాధ్యతలు ప్రభుత్వ ప్రజా పక్షన నిర్వహించాలని భవిష్యత్తులో మరింత ఉన్నతమైన పదవీ బాధ్యతలకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, డాన్పల్ సురేష్, సీనియర్ న్యాయవాదులు ఎం గోవర్ధన్, జి వి కృపాకర్ రెడ్డి, రాజలింగం, రాజారెడ్డి, రాజ్కుమార్ సుబేదార్, మానిక్ రాజ్, అశ నారాయణ, పులి జైపాల్, సతీష్, ఉదయ్, కేశ్వరావ్, నర్సయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.