
నెమలిగుట్ట తండాలో ప్రభుత్వ భవనాలు నిర్మించాలని సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో నెమలిగుట్ట తాండ పలువురు నాయకులు రేతి పత్రాన్ని అందజేశారు. గత పది సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసింది గాని గ్రామపంచాయతీకి కావలసిన పంచాయతీ భవనం, పాఠశాల అంగన్వాడి తదితర భవనాలను నిర్మించడం మర్చపోయింది. నేడు ఆ తండాల్లోని ప్రజలు గ్రామపంచాయతీ భవనం, అంగన్వాడి భవనం ఇతర భవనాలు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నెమలిగుట్ట తండా కు చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సభావత్ రవి, బానోత్ కిషన్లతో కలిసి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మాలోత్ హరిలాల్ నాయక్, జిల్లా కార్యదర్శి దాసరి శ్యామ్ లతో కలిసి వినతి పత్రం అందజేశారు. త్వరలో జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో తండా ప్రజలు ఓట్లు వేయడానికి సైతం భవనాలు లేవన్నారు. ప్రభుత్వ వెంటనే స్పందించి భవనాలు నిర్మించల ఏర్పాటు చేయాలని సోమవారం జిల్లా కలెక్టర్ వింత పత్రాన్ని అందజేసినట్లు వారు తెలిపారు.