తెలంగాణ సమాజాన్ని జ్ఞాన సమాజంగా మార్చలనే కృత నిచ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర గ్రంధాలయ చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెట్రోపాలిటన్ సిటీలలో ఉన్న విధంగా హుస్నాబాద్ లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలను అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కు అనుగుణంగా పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను నిరుద్యోగులకు అందుబాటులో ఉంచే విధంగా కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ ను అక్కున చేర్చుకోని ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా స్థానం రావడానికి హుస్నాబాద్ ప్రజలు కారణమయ్యారన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో హుస్నాబాద్ లో సిద్దిపేట జిల్లాకు తలమానికంగా ఉండేవిధంగా గ్రంధాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు కేడం లింగమూర్తి , అక్కు శ్రీనివాస్, కోమటీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్