– ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ
– ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి
నవతెలంగాణ-కుల్కచర్ల/ చౌడాపూర్
గ్రామాలని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శనివారం కుల్కచర్ల, చౌడాపూర్ మండలలోని పలు గ్రామాలలో నూతన గ్రామపంచాయతీ, డ్వాక్రా భవనాలను, శంకుస్థానన రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాల భవనన్ని ప్రారంభించి స్థానిక నాయకులతో కలిసి గ్రామాలలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందని వాటిని సద్వినియోగపరచుకోవాలన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో మాత్రమే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని గ్రామాలు అభివద్ధి పథంలో ముందుకు సాగేందుకు పల్లె ప్రగతి, హరితహారం లాంటి కార్యక్రమాలు ప్రత్యేక పాత్ర పోషిస్తు న్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.