
కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మెదక్ పార్లమెంట్ సభ్యులు, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక మండల కేంద్రంలో పద్మనాభుని పల్లి గ్రామానికి చెందిన కంచర్ల శ్రీశైలం, రామగిరి రమేష్ లకు ప్రభుత్వం కుల వృత్తులు ప్రవేశపెట్టిన రూ. లక్ష రూపాయల చెక్కులను ఎంపీపీ కొత్త పుష్పాలత,జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, ఏఎంసీ చైర్ పర్సన్ చింతల జ్యోతి కృష్ణ,ఎంపీటీసీ రామవరం మాధవి చంద్రశేఖర్ రెడ్డి, సర్పంచ్ కండ్ల కొయ్య పర్శరాములతో కలిసి అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేద మధ్య తరగతి కుటుంబాలకు ఈ పథకంతో ఆసరాగా నిలిచి తిరిగి వారీ కుల వృత్తులు మరుగున పడొద్దనే ఉద్దేశంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారనీ అన్నారు.ఈ పథకం నిరంతరం కొనసాగుతుందని ఎవరూ అపోహ పడోద్దని ప్రజలకు సూచించారు.