– కలెక్టర్ కోయ శ్రీహర్ష
నవ తెలంగాణ -ఊట్కూర్
రైతు సంక్షేమం దిశగా పటిష్ట చర్యలు తీసుకొని, ప్రతి దశలో రైతులకు అండ గా ప్రభుత్వం నిలుస్తుందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం మండల పరిధిలోని పగిడిమర్రి క్లస్టర్ పరిధిలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా లో భాగం గా రైతు వేదికలో నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలిసి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా పగిడిమర్రిలో రైతు వేదిక, పల్లె దవాఖాన ఆయుష్మాన్ భారత్ వెల్నెస్ సెం టర్‌ను వారు ప్రారంభించారు. రైతు దినోత్సవం సందర్భంగా రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను, సాధించిన ప్రగతి ని వివరిస్తూ వ్యవసాయ విస్తరణ అధికారి ప్రభుత్వం అందించిన సందేశాన్ని రైతు లకు చదివి వినిపించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా రైతుల అభ్యున్నతి కోసం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలు, దాని వల్ల కలిగిన లబ్ధిని రైతులకు గుర్తు చేస్తూ, భవిష్యత్తులో ఆయిల్ పామ్ సాగు కోసం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను వివరించేందుకు రైతులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు, వ్యవసాయ యాంత్రీకరణ, సకాలంలో ఎరువులు, విత్తనాల పంపిణీ , చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలను అమలు చేసిందని అన్నారు. మార్చి చివరి నాటికి యాసంగి కోతలు జరిపేలా ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని ఇందులో భాగంగా పగిడిమర్రి క్లస్టర్ పరిధిలోని వల్లంపల్లి వెంకటాపూర్ పల్లె కుంట గ్రామాల క్లస్టర్ పగిడిమర్రి రైతు వేదికలో జరుగుతున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వ్యవసాయాన్ని పండగలా చేస్తున్నారన్నారు. జిల్లాలో మూడు మున్సిపాలిటీ లు తీసుకువచ్చామన్నారు. అలాగే మోడల్ స్కూల్ ఏర్పాటు చేశామన్నారు. మక్తల్‌కు మూడువేల ఇండ్లు వచ్చాయని, 150 పడకల ఆస్పత్రిని మంజూరు చేశారని తెలిపారు. ఊట్కూర్‌కు పాలమూర్ -రంగారెడ్డి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకోవస్తాం, పగిడిమర్రిలో 4650 రైతులు పంటలు పండిస్తున్నా రన్నారు. మనఊరు- మనబడి కింద అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కృష్ణమచారి, జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ రామ్ మోహన్ రావు, మండల వ్యవసాయ అధికారి గణేష్ రెడ్డి, ఎంపీడీవో కలప్ప, జెడ్పీటీసీ అశోక్ కుమార్‌గౌడ్, ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, సర్పంచ్ సులోచా నమ్మ, వ్యవసాయ విస్తరణ అధికారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.