ప్రభుత్వ నిధులను ప్రజా సంక్షేమానికే ఉపయోగిస్తాం

Government funds will be used for public welfare– తెలంగాణ ఆప్‌ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌
– సినీ నటి హేమ జిల్లోజు ఆప్‌లో చేరిక
నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌
అవినీతికి తావులేకుండా పౌరులకు ఉచిత విద్య, విద్యుత్‌, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను, ఇతర సంక్షేమ పథకాలు అందించడానికి ప్రభుత్వ నిధులను ఉపయో గిస్తామని హామీ ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరుస్తామని ఆప్‌ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌ తెలిపారు. సోమవారం హిమాయత్‌ నగర్‌, లిబర్టీలోని ఆప్‌ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిడ్డి సుధాకర్‌ మాట్లాడుతూ 119 అసెంబ్లీ నియో జక వర్గాల్లో ఆప్‌అభ్యర్థుల గెలుపుకోసం వ్యూహలు రూపొం దించడానికి సెప్టెంబర్‌ 24న హైదరా బాద్‌ లో ఆప్‌ వాలంటీర్‌ల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని, ఇం దులో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్‌ లు, జిల్లా ఇంచార్జిలు, మండల కన్వీనర్‌ లు పాల్గొంటారని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మొత్తం 119 స్థానాల్లో పోటీ చేస్తుందని, ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగుపెడుతామన్నారు. గొప్ప తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్షికోత్స వాలను ఆప్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుందని, అందులో భాగంగా హైదరాబాద్‌ ఆప్‌ రాష్ట్ర కార్యాల యంలో జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుందని దిడ్డి సుధాకర్‌ తెలిపారు.
సినీ నటి హేమ జిల్లోజు ఆప్‌ లో చేరిక
ఆప్‌ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌ సమక్షంలో టాలీవుడ్‌ సినీ నటి హేమ జిల్లోజు ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరారు.ఆప్‌ టోపీ, ఖండువా వేసి ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్బంగా హేమ జిల్లోజు మాట్లాడుతూ అవినీతిని అంతం చేయాలనే నిబద్ధతతో అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టి పెను మార్పు తీసుకువచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను చూసి ఆప్‌లో చేరాలని నిశ్చయించుకున్నాన్నారు. ఈ సమా వేశంలో ఆప్‌ తెలంగాణ కోర్‌ కమిటీ సభ్యులు బుర్ర రాము గౌడ్‌, ఎండి.మజీద్‌, డాక్టర్‌ పాండు రంగయ్య, దివ్య, కమి టీ అధ్యక్షులు దర్శనం రమేష్‌, అధికార ప్రతినిధి ప్రవీణ్‌ యాదవ్‌, నేతలు సలావుద్దీన్‌, ఫైజల్‌ పాల్గొన్నారు.