కంటోన్మెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తోంది

– మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
నవతెలంగాణ-కంటోన్మెంట్‌
కంటోన్మెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తోందనిమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. కంటోన్మెంట్‌ నియోజకవర్గ పరిధిలోని సిరిపురం కాలనీలో శుక్రవారం రూ.12 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్‌ పైప్‌ లైన్‌ పనులను గురువారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరించేందుకు కషి చేస్తానని చెప్పారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న నియోజకవర్గ పరిధిలో రోడ్లు, డ్రయి నేజీ, వాటర్‌ పైప్‌లైన్‌ వంటి పలు అభివృద్ధి పనుల కోసం రూ. 10 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా మంజూరైనాయని తెలిపారు. అభివద్ధి పనులు అన్ని పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాయన్న ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధికి కషి చేస్తామని అన్నారు. సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షే మ పథకాల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ దీపిక, మాజీ కార్పొరేటర్‌ ఆకుల రూప, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి పార్లమెంటరీ ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌ రెడ్డి, మాజీ కార్పొరేటర్‌ లాస్య నందిత, సుబ్రమణ్య స్వామి ఆలయ చైర్మెన్‌ సంతోష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.