గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

– బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్‌రావు
నవతెలంగాణ-దామరచర్ల
గ్రామాల అభివద్ధికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కషి చేస్తుందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌. భాస్కర్‌ రావు చెప్పారు. మండలంలోని వాడపల్లి శ్రీ మీనాక్షి అగస్టశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటి ప్రచారంలో ఆయన మాట్లాడారు. గత పది ఏండ్లలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో కేసీఆర్‌ అభివద్ధి పరచినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్‌ చైర్మన్‌ తెచ్చిన విజయసింహరెడ్డి, డీసీఎఎస్‌ వైస్‌ చైర్మన్‌ దుర్గంపూడి నారాయణరెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిట్‌ ఛైర్మెన్‌ బుచ్చయ్య, ఎంపీపీ నందిని రవితేజ, ఇప్పటిని అంగీతు లలిత వాతీరామ్‌, వైస్‌ చైర్మెన్‌ కుందూరు వీరకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.