నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గాంధీ జయంతిని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం జీవో 1293ను జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గాంధీ జన్మదినమైన ఆక్టోబర్ 2న వేడుకలను నిర్వహించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇందు కోసం చేసే వ్యయాన్ని సంబంధిత శాఖల బడ్జెట్ నుంచి వాడుకోవాలని పేర్కొన్నారు.