ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉర్దూ మీడియంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ, వివిధ చట్టాలపై సెమినార్ 

నవతెలంగాణ –  కామారెడ్డి 
కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉర్దూ  మీడియంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ  జిల్లా మహిళ విభాగం ఆధ్వర్యంలో వివిధ చట్టాలపై సెమినార్ నిర్వహించరు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ జయ కుమారి అధ్యక్షత వహించి  ఆమె మాట్లాడుతూ ఉర్దూ మీడియం ఇంటర్మీడియట్ మొదటి,ద్వితీయ సంవత్సర విద్యార్థినులు వివిధ చట్టాల పైన ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులుగా ఉపన్యాసించిన విద్యార్థినులలో ప్రధమ బహుమతి, ద్వితీయ బహుమతులుగా గెలుపొందిన వారికి సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ భారత్,  తరపున బహుమతులను ప్రధానం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో సహా చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా మహిళా కార్యదర్శి దొమ్మటి లలిత, పట్టణ మహిళ కార్యదర్శి ఎస్ జమున,  మహిళా ప్రతినిధులు షేక్ ఇర్ఫాన, షాహినా, కళాశాల ఉర్దూ మీడియం అధ్యాపక బృందము, విద్యార్థినిలు పాల్గొన్నారు.