నవతెలంగాణ-సంగారెడ్డి
ప్రభుత్వ భూముల రక్షణకు ఆయా శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్స్, పంచాయతీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, తదితర శాఖల అధికారులతో ప్రభుత్వ భూముల రక్షణపై కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను కాపాడటం అత్యంత ప్రధానమైనద న్నారు. ప్రభుత్వ భూముల రక్షణ ప్రథమ బాధ్యత రెవిన్యూశాఖది అన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మున్సిపాల్టీ పరిధిలో గల ప్రభుత్వ భూముల్లో ఎలాంటి ఓపెన్ ప్లాట్స్‌కు, నిర్మాణాలకు ఇంటి నంబర్లు ఇవ్వకూడదని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. అదేవి ధంగా గ్రామపంచాయతీల్లో గల ప్రభుత్వ భూముల్లోనూ అనుమతులు, ఇంటి నంబర్లు ఇవ్వొద్దన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అనుమతులు లేని నిర్మాణాలు జరగొ ద్దని స్పష్టం చేశారు. అలాంటివి గుర్తించిన ప్రారంభ దశలోనే కూల్చివేయాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా సంబం ధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ రిజిస్ట్రేషన్ చేసిన ముందుగా ఆయా అనుమతులు పరిశీలించాలని, 22-A రిజిస్టర్ చెక్ చేయాలని, అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి, సరిగ్గా ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ గ్రామ కంఠం, నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేయొద్దన్నారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న ఇంటి నంబర్ల వివరాలు అందించాలని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఎలాంటి నిర్మా ణాలు జరగొద్దని స్పష్టం చేశారు. రికార్డుల్లో ఉన్న ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిగానే ఉండాలని, రెవిన్యూ రికార్డులలో కరెక్ట్‌గా కనిపించాలని, క్షేత్ర పరిధిలో రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉండాలన్నారు. తహసీల్దార్ సహకారంతో ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను, గ్రామం వారిగా సర్వే నెంబర్ వారిగా చెక్ చేసి 10 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల న్నారు. తహసీల్దార్లు భూముల రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 22-A రిజిస్టర్లో చెక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. రెవిన్యూ అనుబంధ శాఖల అధికారులందరూ ప్రభుత్వ భూముల పరి రక్షణకు కంకణ బదులు కావాలన్నారు. ఈ సమా వేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, హెచ్‌ఎండిఏ అధి కారులు, మున్సిపల్ కమిషనర్లు, నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్లు, సబ్ రిజిస్టార్లు, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డీవోలు, నీటిపా రుదల శాఖ అధికారులు,తహసీల్దార్లు, ల్యాండ్ సర్వే అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నీటి వనరులను పరిరక్షించాలి..
జిల్లాలోని హెచ్‌ఎండిఏ పరిధిలో గల నీటి వనరులు ఆక్రమణలకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకో వాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారు లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నీటిపారుదల, హెచ్‌ఎండిఏ, మైన్స్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, పీసీబీ, రెవిన్యూ, పంచాయితీ, హెచ్‌ఎండిఏ ఏరి యా మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో నీటి వనరుల రక్షణ పై కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో హెచ్ ఎండిఏ పరిధిలోగల చెరువులు కుంటలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలన్నారు. ఆయా నీటి వనరుల సర్వే పూర్తి చేసి, బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ తదితరాలతో చెరువు పరిధిని ఫిక్స్ చేసి నోటిఫై చేయాలన్నారు. రెవిన్యూ శాఖ దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎలాంటి తప్పులు జరగరాదని, రెవిన్యూ సర్వే అధికారులు చెరువుల బౌం డరీలు సరిగ్గా ఫిక్స్ చేయాలని సూచించారు. తప్పుడు సర్వే జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులు, శికం భూములు, కుంటలను కబ్జా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని మిగతా ఏరియాలో ఉన్న చెరువులు ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉండాలని, మున్సిపల్ ఏరియా చుట్టుపక్కల గల నీటి వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ ఫిక్స్ చేసి మ్యాప్స్ తయారు చేయాలని నీటిపారుదల శాఖ అధికారు లకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, హెచ్‌ఎండిఏ ఈఈ, డీఈలు, నీటిపా రుదల శాఖ ఎస్‌ఈ, ఈఈ, ఏడి మైన్స్, డిపిఓ, సంగారెడ్డి ఆర్‌డీఓ, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, పిసిబి ఈఈలు పాల్గొన్నారు.